అంగటిలో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని . 

అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.  

అందని పండ్లకు అర్రులు చాచినట్లు . 

అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి!

అందితే సిగ అందకపోతే కాళ్ళు . 

అంధునకు అద్దం చూపినట్లు . 

అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తే వాడొకడు. 

అగడ్తలో పిల్లికి అదే వైకుంఠం. 

అగ్గి మీద గుగ్గిలం అయినట్టు. 

అగ్నికి వాయువు తోడైనట్లు. 

అగ్గ్నిలో మిడత పడినట్లు. 

అగ్నిహోత్రంలో  ఆజ్యం పోసినట్లు. 

అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్లి. 

అడగందే అమ్మయినా అన్నం పెట్టదు. 

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ. 

అడ్డాలనాటి బిడ్డగాని గడ్డాల  నాటి బిడ్డగాదు!

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న. 

అతిరహస్యం బట్టబయలు. 

అదిగో అంటే ఆరు నెలలు. 

అదిగో తోక అంటే ఇదిగో పులి. 

అద్దం అబద్దం ఆడుతుందా!

అద్దెకు వచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా!

అద్దం మీద ఆవగింజ. 

అనుమానం పెనుభూతం. 

అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది. 

అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు. 

అన్నీ సాగితే రోగమంతా భోగము లేదు. 

అప్పు చేసి పప్పుకూడు . 

అప్పులేని  వాడే అధిక సంపన్నుడు. 

అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. 

అయిన వారికి ఆకుల్లోను కానివారికి కంచాల్లోను . 

అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు?

అయ్యవారిని చేయబోతే కోతి అయింది. 

అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం. 

అరచేతిలో వైకుంఠం చూపినట్లు. 

అవ్వాకావలెను బువ్వ కావలెను. 

అరిటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. 

ఆకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత. 

ఆకలి రుచి ఎరగదు; నిద్ర సుఖం ఎరగదు . 

ఆకాశానికి నిచ్చెన వేయుట. 

ఆడే కాలు పాడే నోరు ఊరకుండదు. 

ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం!

ఆడబోయిన తీర్ధమెదురైనట్లు. 

ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నదట!

ఆత్రగానికి బుద్ది  మట్టు.

 ఆదిలోనే హంసపాదు. 

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. 

ఆయాసం ఒకరిది అనుభవం మరొకరిది. 

ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. 

ఆశకు అంతులేదు. 

అంగట్లో అరువు. తలమీద బరువు. 

అంగిట బెల్లము. ఆత్మలో విషం. 

అంచుడాబే గాని కొకడాబు లేదు. 

అ ఆ లు రావు అగ్రతాంబూలం కావాలి. 

అందని ద్రాక్షపళ్ళు పుల్లన అన్నట్లు. 

ఆశ సిగ్గెరగదు నిద్ర సుఖమెరుగదు. 

ఇంట గెలిచి రచ్చ గెలువు. 

ఇంటికన్న గుడి పదిలం. 

ఇంటికళ ఇల్లాలే చెబుతుంది. 

ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది. 

ఇంటి దొంగను ఈశ్వరుడయినా పట్టలేడు. 

ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు. 

ఇంటి పేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు. 

ఇంటిలో ఈగలమోత బయట పల్లకీమోత. 

ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు. 

ఇంత బతుకు బతికి ఇంటెనుక చచ్చినట్లు. 

ఇంట్లో పులి వీధిలో పులి. 

ఇల్లలకగానే పండగవుతుందా?

ఇచ్చేవాడిని చుస్తే చచ్చినవాడు లేచాడు. 

ఇల్లు ఇరకటం ఆలు మర్కటం. 

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు!

ఇసుక తక్కెడ పేడ తక్కెడ. 

ఈతకాయతో తాటికాయ. 

ఈన గాచి నక్కల పాలు చేసినట్లు. 

ఉట్టికట్టుకు ఊరేగుతారా!

ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికెక్కుద్దా!

ఉడుతకేలరా ఊళ్ళో పెత్తనం. 

ఉడుత ఊపులకు కాయలు రాలునా?

ఉన్నమాటంటే ఉలుకెక్కువ. 

ఉపకారానికి పొతే అపకారం ఎదురైనట్టు. 

ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది. 

ఊరికే వస్తే మావాడు మరొకడున్నాడు. 

ఊరంతా చుట్టాలు ఉట్టికట్ట తావులేదు. 

ఉలిదెబ్బ  తిన్న శిలే శిల్పం అవుతుంది. 

ఎంచబోతే మంచమంతా కంతలే. 

ఎంచిన ఎరువేది అంటే యజమాని పాదమే. 

ఎంతవారలయినా కాంతదాసులే. 

ఎక్కడయినా బావగాని వంగతోటకాడ మాత్రం కాదు. 

ఎండకాచిన చోటే వెన్నెలకాచేది. 

ఎక్కిరించబోయి వెల్లకిలా పడ్డాడంట. 

ఎలుకకు పిల్లి సాక్షం చెప్పినట్టు. 

ఎనుబోతు మీద వాన కురిసినట్టు. 

ఎవరిగోతిలో వారే పడతారు. 

ఏటి ఈతకు లంకమేతకు సరి. 

ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య. 

ఎద్దును అడిగా గంత కట్టేది?

ఎద్దు పుండు కాకికి ముద్దా!

ఎరను చూపి చేపను లాగినట్టు. 

ఎవరి బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది?

ఎవరికి వారే యమునా తీరే.

ఎవరి వెర్రి వారికి ఆనందం. 

ఏ ఎండకా గొడుగు, ఏ గాలికి ఆ చాప. 

ఏకు అయివచ్చి  మేకు అయినా తీరు. 

ఏకులు పెడితే బుట్ట చినుగుతుందా!

ఏగూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుంది. 

ఏ పుట్టలో ఏ పాముందో. 

ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసినట్లు. 

ఏట్లో వేసినా ఎంచి పార వేయాలి. 

ఎటి ఆవలి ముత్యాలు తాటికాయలంత అన్నట్లు.. 

ఏపాటు తప్పిన సాపాటు తప్పదు. 

ఏనుగు మీద దోమ వాలినట్లు. 

ఐశ్వర్యనికి అంతం లేదన్నట్లు. 

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు గదా!

ఒక చెయ్యి తట్టితే చప్పుడవుతుదా!

ఒకే దెబ్బకు రెండు పిట్టలు. 

ఒంటికి ఓర్చలేనమ్మ  రెంటికి ఓర్చునా!

ఒక కలగంటే తెల్లవారుతుందా?

ఓడలు బండ్లగును బండ్లు ఓడలగును . 

కంచు మోగునట్లు కనకంబు మ్రోగునా!

కడుపు నిండిన వానికి గారెలు చేదు.  

కత్తిపోటు తప్పినా  కలంపోటు తప్పదు.   

కననిది బిడ్డ కాదు కట్టనిది చీర కాదు. 

కల్గినవానికి అందరూ చుట్టాలే. 

కామెర్ల రోగికి లోకమంతా పచ్చనే. 

కాలే కడుపుకు మండే గంజి. 

కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు. 

కంచె చేను మేస్తే ఎలాగు!

కందకు లేని దురద కత్తిపీట కెందుకు. 

కక్కు వచ్చిన కల్యాణ గడియ వచ్చినా ఆగవు. 

కట్టె  వంకరను పొయ్యి తీరుస్తుంది. 

కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ. 

కత్తి మీద సాము. 

కన్ను ఉండగా పాప తీయుట. 

కయ్యానికయినా వియ్యానికయినా సమవుజ్జి  ఉండాలి. 

కలిమిలేములు కావడి కుండలు. 

కాకరచెట్టుకు పానకం పోసినట్టు. 

కాకి బిడ్డ కాకికి  ముద్దు గదా!

కాకి ముక్కుకు దొండపండు. 

కాకి గూటిలో కోయిల పిల్ల వలె. 

కాగలకార్యం గంధర్వులే తీర్చారు. 

కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు. 

కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి. 

కాలికి వేస్తే  మెడకు, మెడకు వేస్తే కాలికి. 

కాలు జారినా  తీసుకోగలం నోరు జారితే తీసుకోలేం. 

కాశీకి పోయిన కర్మ తప్పదు. 

కాశీకి వెళ్లి గాడిద గుడ్డును తీసుకువచ్చినట్టు. 

కాసుంటే మార్గం ఉంటుంది. 

కీలెరిగి వాత పెట్టినట్టు. 

కుక్క కాటుకు చెప్పుదెబ్బ. 

కుక్క తోక పట్టుకొని గోదారీదినట్టు . 

కూటికి పేదయితే  గుణానికి పేదా?

కూర ఎంతయినా కూడు కాదు. 

కూసేగాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు. 

కొండత తెలివి కంటె గోరంత కలిమి మేలు!

కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక ఊడింది.  

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు. 

కొండవీటి చేంతాడంత. 

కొంపలంటుకున్న తరువాత నుయ్యి తవ్వుట. 

కొట్టి కోలాహలం చేసినట్టు. 

కొత్త అప్పుకుపొతే పాత అప్పు బయటపడ్డట్టు. 

కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు . 

కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ.  

కొరివితో తల గోక్కున్నట్టు.

కొత్తొక వింత పాతొక రోత. 

కొనగా తీరనిది కొసరగా తీరున!

కోడి గుడ్డుకు ఈకలు లాగినట్టు.

కోడినలు పైనా గుడ్డు తెలుపే. 

కోడిగుడ్డు పగలకొట్ట గుండ్రాయి కావలెనా?

కోతికి అడ్డం చూపినట్లు. 

కోటి విద్యలు కూటి కొరకే. 

కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డునాకినట్టు . 

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. 

కోతి పుండు బ్రహ్మ రాక్షసి. 

క్షేత్రమెరిగి విత్తనం, పాత్ర యెరిగి దానం. 

గతిలేనమ్మకు గంజియే పానకం. 

గంతకు తగిన బొంత. 

గతిలేనమ్మకు మతిలేని మొగుడు. 

గాజుల భేరం బువ్వకు సరి. 

గాడిదకు గడ్డివేసి, ఆవును పాలిమ్మన్నట్లు. 

గాడిద పండుకు ఛుడిద మందు. 

గాలిలో మేడలు కట్టినట్లు. 

గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తిననేర్పవలెనా. 

గొఱ్ఱె ఏడిస్తే తోడేలుకు విచారమా. 

గుండ్రాయిదాస్తే పెళ్లి ఆగిపోతుందా!

గుడినీ గుడిలో లింగాన్ని మింగేస్తాడు. 

గుడ్డి కన్నా మెల్ల మేలు. 

గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు. 

గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు. 

గురువుకే పంగనామాలు పెట్టినట్టు. 

గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు. 

గోచీకి పెద్దది అంగవస్త్రానికి చిన్నది. 

గోటితో పొయ్యేది గొడ్డలి దాక వచ్చింది. 

గోడలకు చెవులుంటాయి. 

గోరంత దీపం కొండంత వెలుగు.   

గోరు చుట్టు  మీద రోకటి పోటు. 

చంద్రునికో నూలుపోగు . 

చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు. 

చక్కనమ్మ చిక్కినా  అందమే!

చచ్చిన వాని  కళ్ళు చారెడు. 

చచ్చిన వాని పెళ్ళికి వచ్చిందే కట్నం. 

చదవేస్తే ఉన్న మతి పోయినట్టు. 

చాపకింద నీరులాగా!

చింత చచ్చిన పులుపు చావదు. 

చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద. 

చీకటి కొన్నాళ్ళు , వెన్నెల కొన్నాళ్లు. 

చెవిటి వాని వద్ద శంఖం ఊదినట్టు. 

చెట్టు ముందా విత్తు ముందా  అన్నట్టు. 

చెక్కర పందిట్లో తేనెవన  కురిసినట్లు. 

చేతిలోది లేత చేలొది ముదురు. 

చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ. 

జుట్టున్నమ్మ కోప్పేంతైనా పెడుతుంది. 

జోగియోగి రాచుకుంటే బూడిద రాలుతుంది. 

డబ్బులేని వాడే ముందు పడవెక్కేది!

తడిగుడ్డతో గొంతు కోయుట. 

తనదాకావస్తేగాని తలనొప్పి బాధ తెలీదు!

తన దీపమని ముద్దు పెట్టుకున్నట్టు. 

తంతే బూరెల గంపలో పడ్డట్టు. 

తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ భేరం. 

తల తాకట్టు పెట్టుట. 

తలపాగా చుట్టడం రాక తల వంకరన్నట్టు. 

తలప్రాణం  తోకకు వచ్చుట

తలుపులేని ఇంట్లో కుక్క దూరినట్లు. 

తన బలము కన్నా స్దాన బలము మిన్న . 

తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్టు. 

తల్లి గూనిదైతే  పిల్ల గూనిదౌనా !

తాచెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు. 

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్లు బెదరవు. 

తాడిచెట్టు కింద పాలు తాగినట్టు. 

తాడిని తన్నువాడిని  తలదన్నే వాడుంటాడు. 

తాతకు దగ్గులు నేర్పదగునా !

తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. 

తాను వలచింది రంభ,తా మునిగింది గంగ. 

తానొకటి తలిస్తే దైవమొకటి తలుచును. 

తినబోతూ రుచి అడగనేల!

తిండికి ముందు తగువుకు వెనుక. 

తిలా , పాపం తలో పిడికెడు. 

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు. 

తుపాకీ కడుపునా ఫిరంగి పుట్టినట్లు. 

తెడ్డు ఉండగా చెయ్యి కాల్చుకున్నట్లు. 

త్రాడు చాలదని బావి పూడ్చుకున్నట్లు. 

తులసి వనంలో గంజాయి మొక్క. 

తెగించిన వానికి తెడ్డే లింగం. 

దంచినమ్మకు బొక్కిందే దక్కుడు. 

దిన దిన గండం నూరేళ్లు ఆయిస్సు. 

దీపముండగానే ఇల్లు చక్కబెట్టులోవలె. 

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టమన్నట్టు. 

దురాశ దుఃఖానికి చేటు. 

దూరపు కొండలు నునుపు. 

దొంగకు తేలు కుట్టినట్టు. 

దొంగకు దొంగబుద్ధి, దొరకు దొర బుద్ధి. 

దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు. 

దాసుడి తప్పులు దండంతో సరి. 

దీపం పేరు చెబితే చీకటి పోతుందా. 

దేవుడి పెళ్ళికి అందరు పెద్దలే. 

నారు పోసినవాడే నీరు పోస్తాడు. 

నిండుకుండ తొణకదు. 

నిజమాడితే నిష్ఠురం . 

నిప్పు ముట్టనిదే చెయ్యి కాలదు . 

నిప్పు లేనిదే పొగ రాదు. 

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు .

నుదుట రాసి నోట పలికించుట. 

నోరుమంచిదైతే వూరుమంచిదే అగును. 

పట్టుచీర ఎరువిచ్చి పీట పట్టుకు తిరిగినట్టు. 

పాడింది పాడరా పాచిపళ్ళ దాసరి. 

పాలుపోసి పెంచిన పాముకు విషం పోదు. 

చావుకు పెళ్ళికి ఒకటే మంత్రమన్నట్లు . 

చేపపిల్లకు ఈత నేర్పవలెనా . 

చేసేవి శివపూజలు చెప్పేవి అబద్దాలు. 

జానెడు ఇంట్లో మూరెడు కర్ర. 

జింక కన్నీరు వేటగానికి ముద్దా!

జిల్లేడు చెట్టుకు పారిజాతాలు పూయునా. 

జీతం లేకుండా తోడేలు మేకలు కాస్తానన్నాదట. 

పిండి కొద్దీ రొట్టె. 

పిచ్చి కుదిరింది తలకి రోకలిచుట్టమన్నట్టు. 

పిచ్చుకమీద బ్రహ్మస్త్రమా . 

పిట్ట కొంచం కూత ఘనం. 

పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం. 

పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ. 

పిల్లికి ఎలుక సాక్షం చెప్పుట. 

పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం . 

పుండుమీద కారం జల్లినట్టు. 

పులిని చూచి  నక్క వాత పెట్టుకొనుట. 

పుల్లయ్య వేమవరం వెళ్లినట్టు. 

పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది. 

పూలమ్మినచోటనే పుల్లలమ్మవలసి రావడం. 

పూలవాసన నారకు పట్టినట్టు. 

పెదవి దాటితే పెన్న దాటినట్టు. 

పెనంలొంచి పొయ్యిలో పడ్డట్టు. 

పెరుగుట విరుగుట కొరకే. 

పేదవాని కోపం పెదవికి చేటు. 

పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట!

బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు. 

బూడిదలో పోసిన పన్నీరు. 

బోడి తలకూ మోకాలుకు ముడి. 

భక్తిలేని పూజ పత్రిచేటు . 

మంచమున్నంతవరకు కాళ్ళు  చాచుకో! 

మంచివానికి మాటే మందు. 

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా !

మగ్గం చేసిన తప్పు సాలె తీర్చాలి. 

మనసుంటే మార్గం ఉంటుంది. 

మనిషి కాటుకు మందు లేదు. 

నడమంత్రపు సిరి నరాలమీది పుండు. 

నరుని కంట నల్లరాయి పగులును. 

నవ్విన నాపచేనే పండుతుంది. 

నాచేతి మాత్ర వైకుంఠ యాత్ర. 

నిండిన కడుపు నీతి ఎరుగదు. 

నిప్పు ముట్టనిదే చేయి కాలదు . 

నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది. 

నోరు కల్లాలపుట్ట పేరు హరిశ్చంద్రుడు. 

పంటచేను విడిచి పరిగ ఏరినట్టు.   

పండాకుని చూచి పసారాకు నవ్వినట్టు. 

పండిత పుత్ర పరమశుంఠ . 

పంది బలిసిన నందితో సమానమా. 

పైసలు ఇచ్చి పాపం కొనుక్కున్నట్టు. 

పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టు. 

ముంజేతి కంకణానికి అద్దం దేనికి?

ముందుకు పొతే నుయ్యి వెనక్కీ పొతే గొయ్యి. 

ముక్కు పిండి వసూలు చేయడం. 

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు. 

మెరిసేదంతా బంగారం కాదు! 

మొక్కై వంగనిది మానై వంగునా?

మొరుగుతున్న కుక్క కరవదు కదా?

మోసేవానికే తెలుసు బరువు. 

రాజు కొట్టగా మొగసాలెకు మొరపెట్టుట. 

రాయిగుద్దనేలా చేయి నవ్వనేల. 

రెక్కాడితే గాని డొక్కాడదు. 

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. 

రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టినట్టు!

రౌతు కొద్దీ గుర్రం. 

లంకమేత గోదారీత . 

లావు మీద వంపు తెలియదు. 

వడ్లగింజలో బియ్యపు గింజ. 

విరిగేదానికంటే వంగేదే మేలు. 

విస్సన్న చెప్పిందే వేదం!

శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు. 

శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు. 

సముఖాన రాయబారమేల?

సిరిరా మోకాలొడ్డినట్టు. 

సొమ్మొకడిది సోకొకడిది . 

స్థానబలిమి గాని తన బలిమి కాదు.