ఒక హల్లుకు ఇంకొక హల్లును చేర్చిన రూపాంతరం చెందిన రెండవ హల్లుని ఒత్తు అంటారు.
| అక్షరం – Hallu | Symbol | Example Word |
|---|---|---|
| క | క్క – అక్క | |
| ఖ | ఖ్ఖ | |
| గ | గ్గ – మొగ్గ | |
| ఘ | ఘ్ఘ | |
| చ | చ్చ – పచ్చ | |
| ఛ | ఛ్ఛ | |
| జ | జ్జ – గజ్జలు | |
| ఝ | ఝ్ఝ | |
| ట | ట్ట – పొట్ట | |
| ఠ | ఠ్ఠ | |
| డ | డ్డ | |
| ఢ | ఢ్ఢ | |
| ణ | ణ్ణ | |
| త | త్త – కొత్త | |
| థ | థ్థ | |
| ద | ద్ద – ముద్ద | |
| ధ | ధ్ధ | |
| న | న్న – అన్న | |
| ప | ప్ప – కప్ప | |
| ఫ | ఫ్ఫ | |
| బ | బ్బ | |
| భ | భ్భ | |
| మ | మ్మ – అమ్మ | |
| య | య్య – కొయ్య | |
| ర | ర్ర | |
| ల | ల్ల – పిల్ల | |
| వ | వ్వ – అవ్వ | |
| శ | శ్శ | |
| ష | ష్ష | |
| స | స్స | |
| హ | హ్హ | |
| ళ | ళ్ళ | |
| క్ష | క్ష | (క్ష) |
| ఱ | ఱ | ఱ్ఱ |
ద్విత్వాక్షరములు:
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: అన్నము, మగ్గము
సంయుక్తాక్షరములు:
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాజ్యము, మద్యము
సంశ్లేషాక్షరములు:
ఒక హల్లుకు ఒకటికన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాష్ట్రము, మత్స్యము
మహాప్రాణాక్షరములు:
ఒక హల్లులోనే ఒత్తును కలిగియుండును.
ఉదా: శంఖము, పాఠశాల
